ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ మాదిగ
27-08-2026 11:16 PM
వీపనగండ్ల: ఎమ్మార్పీఎస్ వీపనగండ్ల మండల నూతన అధ్యక్షుడిగా ప్రవీణ్ మాదిగ ఎన్నికయ్యారు. అంబేద్కర్ కాలనీలో నిర్వహించిన కమిటీ ఎన్నికల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కొమ్మవారి మస్తాన్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా కృషి చేయాలని కోరారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించే ఎమ్మార్పీఎస్ జాతి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రధాన కార్యదర్శిగా బండారి విష్ణు మాదిగ, ఉపాధ్యక్షుడిగా మొలకపల్లి నాగరాజు మాదిగ, కోశాధికారిగా గడ్డమీద రాముడు మాదిగ ఎన్నికయ్యారు.






