28 August, 2026 | 12:55 AM

విట్యాల 1వ వార్డులో ప్రజలకు చెత్తబుట్టలు పంపిణీ

27-08-2026 11:11 PM

షాద్ నగర్,(విజయక్రాంతి): ఫరూక్‌నగర్ మండల వార్డు మెంబర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కే. రాజు  ఆధ్వర్యంలో గురువారం విత్యాల గ్రామం 1వ వార్డులోని ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వార్డు మెంబర్ కే. రాజును అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎం.డి. వాహబ్, కావాలి రాజు, ఉప సర్పంచ్ రమేష్, వీఓఏ మొయినుద్దీన్, వార్డు మెంబర్లు చిట్టెమ్మ, యాదమ్మ, సునీత, విజేందర్, లక్ష్మీ, యాదయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మమ్మ, ఆశా వర్కర్ పద్మతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.