19-02-2026 01:26:09 AM
కేసముద్రం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): సీఎం కప్ సెకండ్ ఎడిషన్ గేమ్స్ ని ర్వహణలో భాగంగా మహబూబాబాద్ జి ల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఇనుగుర్తి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
వాలీబాల్ బాలుర విభాగంలో చిదిరాల వివేక్ వివేక్ , సాఫ్ట్ బాల్ బాలుర విభాగంలో జాటోత్ అజయ్, గూగులోతు రామ్ చరణ్ , బాలికల విభాగంలో నంగునూరు భార్గవి, బీ.ని హారిక, బొల్లు సహస్ర ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్ తాళ్ళ ప్రణయ్ ని ఇనుగుర్తి ఎంఈఓ జంగారూపారాణి, ఎంపీడీవో బండారు పార్థసారథి అభినందించారు.