పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- 60 గజాల ఇళ్ల స్థలాల బాధితులకు మద్దతుగా రిలే దీక్షలో పాల్గొన్న సబిత
మొయినాబాద్ జూలై 12(విజయ క్రాంతి): 60 గజాల ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల పట్టాలు పొందిన 290 మంది పేదలు ఇండ్లు నిర్మించుకుందుకు స్థలాలను చూపించాలని, హిమాయత్ నగర్ గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష 17వ రోజుకు చేరింది. ఆదివారం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై బాధితులకు మద్దతు తెలిపారు.
2007 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి భూగర్భ శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా పంపిణీ చేసిన పట్టాలపై గ్రామస్థులకు ఉన్న సందేహాలు వ్యక్త పరచగా.. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. హిమాయత్ నగర్ గ్రామస్తులకు 2007 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు 60 గజాల ఇళ్ల స్థలాల పట్టాలను తన చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునే సమయంలో ఆ భూమిపై కేసు ఉందని అధికారులు తెలిపారు. కానీ ఆ సమయంలో ఆ భూములు ఎక్కడికి పోవు అని జాప్యం జరగడం నిజమేనని, అందుకు మీరు నన్ను క్షేమించాలని బాధితులను కోరారు.
ఇదే విషయమై పేదల పక్షాన నిలిచి సత్వరమే ఇళ్ల స్థలాలు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సూచించడం జరిగిందని, కానీ ఎమ్మెల్యే అలసత్వం వలనే ఇప్పుడు ఈ దుస్థితికి వచ్చిందని ఆమె చెప్పారు. గుడ్డిమల్కాపూర్ మార్కెట్ యార్డు ఏర్పాటుకు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడ కేటాయించకుండా పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఏర్పాటు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.
పేదలు ఇదే విధంగా జట్టు వీడకుండా పోరాడితే 60 గజాల కాదు 120 గజాలు రావడం ఖాయమని ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక నిరుపేదలకు మాత్రమే ఇళ్ల స్థలాలను కేటాయించాలని, ఈ జాగీరు మీదేనని దీని లాక్కోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. హిమాయత్ నగర్ పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడతానని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తానన్నారు. ఇళ్ల స్థలాలు పేదలకు దక్కేవరకు బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైన్యంల మీ వెంట ఉంటామని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దేశముల్ల ఆంజనేయులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు ముదిగొండ శ్రీహరియాదవ్, విజయ్ ఆర్య, హిమాయత్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ ముదిగొండ మంజుల రవియాదవ్, ఉప సర్పంచ్ షాబాద్ శ్యామ్ రావు, కౌన్సిలర్లు బిల్లపాటి కవిత ఏల్లేష్, కర్రోల శ్రీధర్, గునుగుర్తి దర్శన్ ( చిన్న) డప్పు రాజు, నరసింహ గౌడ్, కుమ్మరి సుదర్శన్, సలీంఖాన్, కుమ్మరి రాము, జేల్లెల మల్లేష్ యాదవ్, కాళిదాస్ చారి, యువజన సంఘాల అధ్యక్షులు కొర్ర గోపాల్, కుమ్మరి విఠల్, కట్టమీది శ్రీను, కరీం, హిమాయత్ నగర్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






