29 August, 2026 | 6:23 PM

వృక్షాబంధన్ వేడుకలు

29-08-2026 05:34 PM

రాజాపూర్ ఆగస్టు 29(విజయక్రాంతి):  మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారంవిద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో ఉన్న  మదర్ చెట్టుకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వృక్షాలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చెట్టు యొక్క ఆవశ్యకత, ఆక్సిజను, మెడిసిన్ గా పండ్లను నీడనిచ్చేది, కలపనిచ్చేదిగా, ఉపయోగపడుతుందని వివరించారు.ప్రతి విద్యార్థి  పాఠశాలలో,ఇంటిదగ్గర  మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.