29 August, 2026 | 7:13 PM

పుష్కర ఘాట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

29-08-2026 06:05 PM

భద్రాచలం (విజయ క్రాంతి):  భద్రాచలం గోదారి తీరంలో వచ్చే ఏడాది జరుగు గోదావరి నది పుష్కరాల సందర్భంగా భద్రాచలం వద్ద 46.65 కోట్ల రూపాయలతో నిర్మించే స్నాన ఘట్టాలు పుష్కరఘట్ల నిర్మాణం పనులను శనివారం నిర్వహించారు.  ఈ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి,  ఆలయ ఈఓ దామోదర్ రావు  పాల్గొన్నారు.