29 August, 2026 | 7:12 PM

రళ గ్లోబల్ హై స్కూల్లో ఘనంగా తెలుగు భాష దినోత్సవం

29-08-2026 06:03 PM

రుద్రంగి ఆగష్టు 29(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ గ్లోబల్ హై స్కూల్లో ఘనంగా తెలుగు భాష దినోత్సవన్నీ  నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బాబు నంబియార్,ప్రన్సిపాల్ లతిక, మాట్లాడుతూ.గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటామని విద్యార్థులకు తెలిపారు.ఆధునిక తెలుగు వాడుక భాషా ఉద్యమ కర్త గిడుగు వెంకట రామమూర్తి అని కొనియాడారు.

ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషనుసాహిత్యంలోకి,చదువులోకి తీసుకొచ్చిన గిడుగు చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరించి చెప్పారు.తెలుగు పాటలపై విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృ బాష తెలుగును మాత్రం మరిచిపోవద్దని తెలుగు భాష ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో,పాఠశాల ఇంచార్జ్ నరిగే విజయ్,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.