29 August, 2026 | 6:52 PM

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

29-08-2026 05:51 PM

నిర్మల్, ఆగస్టు 29 ( విజయ క్రాంతి): మహిళలు వ్యాపార పారిశ్రామిక రంగంలో రాణించాలని డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని వి హబ్‌ సౌజన్యంతో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు శనివారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు కార్యక్రమంలో డీపీఎం మారుతి, వి-హబ్‌ డైరెక్టర్‌ జాహిద్‌‌ షేక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, ప్రతినిధులు డాక్టర్‌ డెబోశ్రీ, రూపానంద్‌, హరిచందన, స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.