తుంగతుర్తి ఎల్టా మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
29-08-2026 05:49 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కమిటి పిలుపు మేరకు తుంగతుర్తి మండల ఎల్టా కమిటీని జెడ్పిహెచ్ఎస్ తిరుమలగిరిలో అప్ లేవెల్ ఇంగ్లీష్ కాంప్లెక్స్ మీటింగ్ లో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పు కృష్ణవేణి, వైస్ ప్రెసిడెంట్ ఎం.సురేందర్ రావు, జనరల్ సెక్రటరీగా అలకుంట్ల యాకన్న, జాయింట్ సెక్రటరీలుగా రవికుమార్ బాబు, ఎలిజబెత్, కోశాధికారిగా అనురాధ, జిల్లా కౌన్సిలర్ సుగుణ, బాళోజి, ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులను పలువురు అభినందించారు.






