ప్రజా ఆశీర్వాదంతో మరిన్ని విజయాలు సాధించాలి
ఘనంగా పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు
సిద్దిపేట రూరల్,ఆగస్టు 29(విజయక్రాంతి): సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలను నారాయణరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్‌యూఐ, అనంతరం యువజన కాంగ్రెస్‌లో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి హరికృష్ణ సేవలందించారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశంతో పలు రాష్ట్రాల్లో పనిచేసిన ఆయన, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొన్నారు.
ఓటమిని భవిష్యత్ విజయానికి నాందిగా భావిస్తూ సిద్దిపేట ప్రాంత సమస్యలపై పోరాడటంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో నాయకత్వ లోపంతో ఉన్న సిద్దిపేట కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో పూజల హరికృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బుగ్గరాజేశ్వర దేవస్థానం చైర్మన్ బాగన్నగారి కరుణాకర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్‌వీర్, సర్పంచ్ బాబు, ఉప సర్పంచ్ పర్శరాములు, గ్రామ అధ్యక్షుడు బిట్ల శ్రీనివాస్, వార్డు మెంబర్ నవీన్ యాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ దాసరి ఉమ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కూరటి రాజయ్య, గ్రామాల అధ్యక్షులు మాట్ల రాజు, కూరటి చంద్రం, బంజెరూపల్లి కనకయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు జిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






