పరివేదలో ఉచిత వైద్య శిబిరం
29-08-2026 05:57 PM
కోహెడ, ఆగష్టు 29, విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేదలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు.. గవ్వ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద కరీంనగర్ సన్రైస్ ఆసుపత్రి సౌజన్యంతో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు శిబిరం కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు శిబిరంకు వచ్చి వైద్యులతో పరీక్షలు చేపించుకోని మందులు తీసుకోవాలని కోరారు.






