29 August, 2026 | 7:12 PM

పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు

29-08-2026 06:10 PM

నిర్మల్ ఆగస్టు 29 ( విజయ క్రాంతి): పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ బకాయిలను ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి” నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు.

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ నాయకులు  నాయకులు పాల్గొన్నారు.