29 August, 2026 | 8:10 PM

ఫీజు బకాయి బిజెపి లడాయి

29-08-2026 05:35 PM

విద్యార్థులకు ఒకే విడతలో ఫీజు రియంబర్స్మెంట్ ను  చెల్లించాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్

 అమర వీరుల స్తూపం వద్ద యువ మోర్చా అధ్యక్షులు జజ్జూరు మోహన కృష ఆధ్వర్యంలో నిరసన దీక్ష

కొత్తగూడెంటౌన్,(విజయక్రాంతి): విద్యార్థులకు ఒకే విడతలు ఫ్రీజర్ రియంబర్స్మెంట్ చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపుమేరకు  విద్యార్థి, విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి కోరుతూ స్థానిక బస్టాండ్ వద్దగల స్థూపం వద్ద బిజెపి ఆధ్వర్యంలో శనివారం  నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన  ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ వాగ్దానాలతో అధికారంలోకీ వచ్చారన్నారు.  సీఎం  విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకుని విద్యార్ధుల భావిభారత భవిషత్ ను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుమారు 40 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం బకాయి ఉన్న రూ.15,000 కోట్ల ఒకే విడతలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున  ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు, డాక్టర్ జాటోత్ వెంకన్న, బిక్షపతి, బోగి కృష్ణ, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, కిసాన్ మోర్చా అధ్యక్షులు గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాసరావు, మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముసుకు  శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.