జీవితాన్ని స్వీకరించండి.. మాదకద్రవ్యాలను కాదు
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఎంచుకోవాలని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి సూచించారు. నారాయణగూడ బి.జె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా సా ంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా! పేరుతో నిర్వహించిన కళాజాతను ఆయన ప్రారంభించారు.
తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ నేతృత్వంలో కళాకారులు ప్రదర్శించిన వీధినాటకం విద్యార్థులను ఆకట్టుకుని మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పి ంచింది. నారాయణగూడ సీఐ ఎం. సైదేశ ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డా. ఎం. వి జయ్ కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, కల్చరల్ కోఆర్డినేటర్లు కె. గీత, సి.వి.ఎల్. నా రాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ ఎం. సైదేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. డా. ఎం. విజయ్ కుమార్ మాట్లాడుతూ వి ద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు వి. వెంకటచారి, పి. సైదులు, విజయ్, రాములు, శైలజ, మంగ తదితరులు పాల్గొన్నారు.






