రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు
- బీసీలందరు ఏకం కావాలి
- ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో.. పాల్గొన్న పలువురు బీసీ సంఘాలు, పార్టీల నాయకులు
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి దేశంలో బీసీ రిజర్వేషన్లను తీసేయడానికి కుట్రనలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ ఫాంలో కూడా ఎస్సీ ఎస్టీ ఆప్షన్ పెట్టి, బీసీ లేదా ఓబీసీ అని ఆప్షన్ ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. సెన్సెస్‌లో కూడా బీసీ ఓబీసీ ఆప్షన్ లేదన్నారు. కుల గణన జరగాలని వీహెచ్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు వివిధ కుల సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఓబీసీ అని చెప్పుకుంటున్నాడని, కానీ బీసీలకు మోదీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే బీసీల కులగణన జరిగితేనే బీసీ లకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినపుడు అన్ని కుల గణన చేసి బీసీ లాకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలందరు కలిసికట్టుగా ముందుకు రావాలని, ఇన్ని రోజులు బీసీలను విడగొట్టి అధికారం చేపట్టిన వారికి కుట్రలను చెక్ పెట్టాలన్నారు. బీసీలకు కు జనగణన లో అన్యాయం చేస్తునారని, ఇప్పుడు పోరాటం చేయకపోతే ఈ జాతి మనల్ని క్షమించదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించిన వారికే బీసీలు మద్దతిస్తారని తెలిపారు.
యువత మేల్కొని బీసీ హక్కుల పోరాటానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి, బాలరాజ్ గౌడ్ , గుజ్జ కృష్ణ , బీసీ కుల సంఘాల చైర్మన్లు బొమ్మ శ్రీరామ్, బాలరాజ, సరితా తిరుపతయ్య, చరణ్ కౌశిక్ యాద వ, రేణుక, అజయ్, బోయ నగేష్, బంగారు బాబు ఆర్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి అధ్యక్షులు మోత రోహిత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురా లు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.






