25 August, 2026 | 2:25 AM

భవనం కూలిన ఘటనలో బిల్డర్ అరెస్ట్

25-08-2026 01:28 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూలిపోయి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సయ్యద్ సజీద్ అలియాస్ సయ్యద్ సాజిద్ (39)ను ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో నిందితుడు ఖాజా మొయినుద్దీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మృతులు ఉమేష్ కారే, మొహ్పాల్ భలావిలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని రాయదుర్గం పోలీసులు తెలిపారు.