21-02-2026 05:13:53 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,(విజయక్రాంతి): తల్లితండ్రులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు హాజరు అయ్యే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఇంటి వద్ద కూడా సాధన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఏ ఏ సబ్జెక్టు ను ఏ విధంగా చదవాలో వివరించారు. పలు మోటివేషన్ కథలు చెప్పారు. పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, వివిధ భాష సామర్ధ్యాలను పరిశీలించి, పలు గణిత సమస్యలను పరిష్కరించారు. పరీక్షల సమయంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో గరిష్ట ఉత్తీర్ణత సాధించడం, గుణాత్మక అభ్యాస ప్రమాణాలు పెంపొందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.
పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. అందరూ ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాలులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.