calender_icon.png 21 February, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ఎంపీడీవో

21-02-2026 05:17:46 PM

బిబిపేట,(విజయక్రాంతి): బీబీపేట మండల కేంద్రంలోని యాడారం గ్రామం లో ఉపాధి హామీ పనులను స్థానిక ఎంపీడీవో బంతి పూర్ణచంద్రోదయ కుమార్ శనివారం పరిశీలించారు. వికసిత్ భారత్ - జీ- రామ్- జీ" (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకంలో పనిచేస్తున్న కూలీలకు కావలసిన వసతులు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయి సహాయకులను అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా కూలీలతో మాట్లాడుతూ... ప్రభుత్వం సూచించిన సమయపాలనను పాటించి ఆ కూలికి సరిపడు వేతనాలను తీసుకోవాలని తెలిపారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీలలో దరఖాస్తు చేసుకొని పని గుర్తించిన స్థలాలలో క్షేత్రస్థాయి సహాయకుని సూచనల మేరకు పనులను పొందాలని సూచించారు కార్యక్రమంలో కోనాపూర్ గ్రామ కార్యదర్శి భరత్, యాడారం ఫీల్డ్ అసిస్టెంట్ గొబ్బూరి నారాయణరెడ్డి కూలీలు ఉన్నారు.