కార్నర్ స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థి నాయకత్వ ప్రతిష్టాపన కార్యక్రమం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి కార్నర్‌స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో బుధవారం నాడు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థి నాయకుల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి హాజరై విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందజేసి, బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
కార్నర్‌స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎం.డి.జయపాల్ గొరంట్ల ప్రమాణ శ్రీకార కార్యక్రమంలో స్కూల్ కాబినెట్ ను అభినందించారు. కొత్తగా ఎంపికైన స్కూల్ మరియు హౌస్ నాయకులు ప్రతిజ్ఞ చేసి, పాఠశాల నియమ నిబంధనలను గౌరవిస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను విశ్వసనీయతతో నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందజేయడం ద్వారా వారి నాయకత్వ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శౌరీ , కే. ఉమాదేవి ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొని, నూతన విద్యార్థి నాయకులను అభినందించారు.






