28 August, 2026 | 7:54 AM

అందుబాటులోకి అత్యాధునిక లాప్రోస్కోపిక్ సర్జరీలు.

28-08-2026 12:12 AM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): రోబోటిక్, అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ సర్జరీలతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం అందుబాటులోకి వచ్చినట్లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పమీడియా సమావేశంలో మాట్లాడుతూ... పేగు, కిడ్నీ, ఓవరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన క్లిష్ట సమస్యలకు రోబోటిక్ టెక్నాలజీతో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చిన్న కోతలతో శస్త్రచికిత్స చేయడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ చికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్లు సుదర్శన్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.