కామారెడ్డిలో వృక్ష రక్షాబంధన్
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విన్నుతన కార్యక్రమం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగము, క్లైమేట్ స్మార్ట్ గ్రీన్ క్యాంపస్ క్లబ్, ఈకో క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వృక్ష రక్షాబంధన్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బీఎస్సీ బాటనీ ఫారెస్ట్ విద్యార్థులు పర్యావరణ హిత పదార్థాలైన పుష్పాలు, పత్రాలను ఉపయోగించి ఆకర్షణీయమైన రాఖీలు తయారు చేశారు. మొక్కలను మనం రక్షిస్తే మొక్కలు మనను రక్షిస్తాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్, ఈకో క్లబ్ చైర్మన్ టిస్ దినకర్ చిన్న మొక్కల ప్రాముఖ్య్యాన్ని తెలిపారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు రాశి వనంలోని మొక్కలకు పర్యావరణ రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో బాటనీ, ఫారెస్ట్ అధ్యాపకులు శ్రీవల్లి, శ్రీలత, స్వాతి, వెన్నెల, వర్షిని, రమణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






