మృతుల చిత్రపటాలకు మాజీ జడ్పిటిసి సదానందం నివాళులు
28-08-2026 12:16 AM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని మైదంబండ గ్రామానికి చెందిన ఆటాల శంకరయ్య, పుట్ట చిన్న మల్లయ్య ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం ముదిరాజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.






