28 August, 2026 | 2:42 AM

ఎర్రవరం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

28-08-2026 12:01 AM

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ  కోదాడ మండలం రూరల్ గ్రామం ఎర్రవరంలో మండల అధ్యక్షులు చడపంగు ఉపేందర్ అధ్యక్షతన గ్రామ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కన్వీనర్ ఏనుగుల యల్లేశ్వరరావు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవ్ రావు నాయక్ పిలుపుమేరకు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

దీనిలో భాగంగా ఎర్రవరం గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా సయ్యద్ ఇమామ్ సాబ్,  గ్రామ ప్రధాన కార్యదర్శిగా మానుపాటి కొండలరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల ఉపాధ్యక్షులు పాముల శివ చడపంగు అరవిందు, యానల ధనయ్య మిట్టపల్లి సైదులు వల్లేపు సురేష్  పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.