28 July, 2026 | 6:55 PM

బాసర ఐఐఐటీలో గట్లమల్యాల విద్యార్థిని

28-07-2026 06:02 PM

నంగునూరు,(విజయక్రాంతి): బాసర ఐఐఐటీ లో నంగునూరు మండలం గట్లమల్యాల ఉన్నత పాఠశాలకు చెందిన భానోతు షణ్ముఖప్రియ స్పోర్ట్స్ కోటాలో సీటు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు ఎం.రమేష్ తెలిపారు.మంగళవారం వెలువడిన ప్రవేశాల్లో పాఠశాల నుంచి బాసర సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరిందని తెలిపారు. క్రీడా కోటాలో సీటు సాధించడం అభినందనీయమని హెచ్‌ఎం రమేష్ పేర్కొంటూ... విద్యార్థిని షణ్ముఖప్రియను,వ్యాయామ ఉపాధ్యాయులు డి.రాజ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సాధించిన షణ్ముఖప్రియ ను గ్రామ సర్పంచ్ ఇంగ నరేష్,ఉపసర్పంచ్ తిప్పని శ్రీనివాస్, ఏపీసీ చైర్మన్ తిరుమల,పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.