1 September, 2026 | 10:29 PM

సోషల్ మీడియాపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

01-09-2026 | 09:25pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కేరళ మోడల్ హైస్కూల్(Kerala Model High School) ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులు(Students) సోషల్ మీడియాను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచుకుని, చదువు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సందేశమిస్తూ పట్టణంలోని పలు వాడల్లో మంగళవారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసి, విలువైన సమయాన్ని చదువు, క్రీడలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వినియోగించాలనినినాదాలు చేశారు.