ప్రమాద బాధితుడికి పాఠశాల సిబ్బంది ఆర్థిక సాయం
టేకులపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్‌కు టేకులపల్లి మండలం బోడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న మొక్కటి భూలక్ష్మి, అబ్బయ్య దంపతుల కుమారుడు సాయికుమార్ హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్య ఖర్చులకు అండగా నిలవాలని నిర్ణయించిన పాఠశాల సిబ్బంది తరఫున రూ.8,200 ఆర్థిక సహాయాన్ని ప్రధానోపాధ్యాయులు అజ్మీరా జగన్ చేతుల మీదుగా భూలక్ష్మికి అందజేశారు. ఈ సాయం సాయికుమార్ వైద్య చికిత్సకు కొంతమేర ఉపయోగపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఆకాంక్షించారు.






