1 September, 2026 | 10:29 PM

ఎన్నికల 100 రోజుల హామీని, 1000 రోజులైనా అమలు చేయని అసమర్థ కాంగ్రెస్

01-09-2026 | 09:28pm

మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): ఎన్నికల 100 రోజుల హామీలను 1000 రోజులు పూర్తయిన అమలు చేయని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి పూరించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా బిఆరెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్ నగర్ నియోజక వర్గ పార్టీ సమన్వయ కర్త  ఒంటెద్దు నర్సింహా రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండల,పట్టణ బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... బిఆరెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ నియోజకవర్గంలో, ప్రతీ మండలంలో 2 వ తారీకు నుండి 8 వ తారీకు వరకు ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై, అమలు గాని హామీలపై బిఆరెస్ పార్టీ సమర భేరి చేయడం జరుగుతుంది.

420 హామీలపై బాకీ కార్డ్ విడుదల చేసి,7 రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు.మహాలక్ష్మి, 500 గ్యాస్,రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పిన 12000, కౌలు రైతులకు 15000, వరికి 500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు,ఇంటి స్థలం  5 లక్షలు,ఉద్యమకారులకు 250 గజాల భూమి, యువవికాసం పథకం, 5 లక్షల భరోసా కార్డులు, చేయూత పెన్షన్లు 4000రూ,తదితర హామీలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఈ కార్యక్రమంలో,బిఆరెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, హుజూర్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు చెన్నబోయిన సైదులు యాదవ్, నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, మైనార్టీ నాయకులు హుస్సేన్, సీనియర్ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, మాజీ గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ,మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు వస్కల సుదర్శన్, పోకబత్తిని శేఖర్, తదితరులు పాల్గొన్నారు.