11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం

11-04-2026 03:58 PM

తాండూర్,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో చట్టసభల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో  పోరాటం చేస్తామని ఆ పార్టీ నాయకులు అన్నారు.  శనివారం మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్భంలో తాండూరు పట్టణం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ... సమాజంలో అణగారిన జాతులకు విద్య అందడం కోసం పూలే జరిపిన ఆత్మగౌరవ పోరాటం మరువలేనిదని అన్నారు.

సమాజంలో అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైన బలహీన వర్గాలకు విద్యను అందించడం కోసం తన జీవితాన్ని ధారా పోశారన్నారు. తన భార్యతో కలిసి దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి నాటి కుల ఆధిపత్య ఉన్మాదులకు సవాలు విసిరిన ధైర్యశిలీ అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సిఐటియు,  సిపిఎం నాయకులు సతీష్ జైపాల్ శ్రీనివాస్ వెంకటప్ప దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.