11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

సామాజిక ఉద్యమాల తొలి తరం గొంతుక జ్యోతిబాపూలే

11-04-2026 04:01 PM

సత్తుపల్లి డిపోలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

సత్తుపల్లి,(విజయక్రాంతి): సామాజిక ఉద్యమాల తొలితరం గొంతుక జ్యోతిబాపూలే అని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సత్తుపల్లి డిపోలో జ్యోతిబాపూలే 199 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చత్రపాటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల చైతన్యానికి ప్రతీక, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహాత్ముడు జ్యోతిబాపూలే అని అన్నారు. సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు జ్యోతిబాపూలే అని ఆయన కొనియాడారు. గొప్ప విద్యావేత్త, సంఘసంస్కర్త మహిళలకు విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహానీయుడు జ్యోతిబాపూలే అని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను డిపో మేనేజర్ కొనియాడారు.