11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

కేబుల్ న్యూస్ ఛానల్ వారు దరఖాస్తు చేసుకోవాలి

11-04-2026 03:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర,జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి విష్ణువర్ధన్ తెలిపారు. రాష్ట్ర కమిషనర్ ప్రియాంక ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి, స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు పొందటానికి, జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగిన వారు ఆయా జిల్లాల్లో కార్డులు పొందటానికి నేరుగా ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులో ఛానల్ పేరు మరియు స్టూడియో అడ్రస్ తో పాటు, ఎమ్ ఐ బి సర్టిఫికెట్, లేబర్ లైసెన్స్, ఎం ఎస్ ఓ లతో చేసుకున్న ఛానల్ ప్లేస్మెంట్ అగ్రిమెంట్ల కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.అర్హత గల ఛానళ్లకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అక్రిడేషన్స్ జారీ చేయబడతాయని వివరించారు.