30 July, 2026 | 9:48 PM

అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే

30-07-2026 09:11 PM

మనిషి అక్కడ… మనసు ఇక్కడ – పసుమర్తి చందర్రావు

కల్లూరు,(విజయక్రాంతి): “మనిషి అక్కడ ఉన్నా… మనసు మాత్రం ఇక్కడే” అన్నట్లుగా అమెరికాలో ఉన్నప్పటికీ తన ఆలోచన అంతా కల్లూరు అభివృద్ధి వైపే ఉందని ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పసుమర్తి చందర్రావు పేర్కొన్నారు. కల్లూరు ప్రాంతానికి ప్రత్యేక స్థానం కల్పించాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. పనిమీద మీద అమెరికాలో ఉన్నప్పటికీ స్వగ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నట్లు చెప్పారు.

గురువారం నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లకు మండలంలోని కీలక సమస్యలు,ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అంశాలపై వినతిపత్రం అందించేలా మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ద్వారా  అందించినట్లు తెలిపారు.తనకున్న రాజకీయ అనుభవం,సీనియారిటీతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభం నుంచే గ్రామం,మండలం,జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందువల్ల వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.