దక్షిణాదిపై స్టోరీ టీవీ భారీ అడుగు
హైదరాబాద్, జూలై 30, 2026:
భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. మారుతున్న అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పూర్తిగా స్థానిక కథలతో నాణ్యమైన మైక్రో డ్రామాలను రూపొందించేందుకు స్టోరీ టీవీ సిద్ధమైంది. ఈ ప్రణాళికలో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్థానిక రచయితలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఒరిజినల్ కథలను రూపొందించనుంది. ప్రతి భాషలో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలను అందిస్తూ, భారతీయ మైక్రో డ్రామాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని స్టోరీ టీవీ భావిస్తోంది.
తెలుగు ఒరిజినల్ షోల కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టోరీ టీవీతో చేతులు కలిపారు. 'వన్ లాస్ట్ రైడ్' దర్శకుడు అజ్జు, నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ (స్వాతి చినుకులు, ఋతురాగాలు), అలాగే చరణ్ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్), రాజ్ (బిగ్‌బాస్ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్ (అభిషేకం), మోనిక (పద్మావతి కళ్యాణం) వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు.దక్షిణ భారత ప్రేక్షకుల్లో స్టోరీ టీవీకి ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాలు స్టోరీ టీవీకి అత్యధికంగా వీక్షణలు అందిస్తున్న నగరాలుగా నిలిచాయి. దక్షిణాది ప్రేక్షకులు రోజుకు సగటున 95 నిమిషాలకు పైగా స్టోరీ టీవీలో గడుపుతున్నారని సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జీఎస్ఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఈరోజు వినోదం పూర్తిగా మొబైల్‌కే పరిమితమైంది. ప్రేక్షకులు కూడా తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. అలాంటి కథలను తక్కువ సమయంలో ఆసక్తికరంగా చెప్పడానికి మైక్రో డ్రామా ఒక అద్భుతమైన ఫార్మాట్‌గా మారింది. దీంతో రచయితలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు... ఇలా ఎంతో మంది సృజనాత్మక ప్రతిభకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ కథలను మరింత కొత్తగా, మరింత మందికి చేరేలా చెప్పడానికి ఇది ఒక మంచి వేదికగా మారిందన్నారు.స్టోరీ టీవీ రూపొందించిన తెలుగు ఒరిజినల్ షోలు ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించాయి. వాటిలో మార్కెట్ లో కొత్త సరుకు, వారసుడు వచ్చాడు, రక్త సంబంధం వంటి షోలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి.






