11 June, 2026 | 4:31 PM

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

11-06-2026 03:26 PM

* మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య 

* పట్టణంలో పట్టిన దుకాణాల ఆకస్మిక తనిఖీ 

అచ్చంపేట జూన్ 11: ఫర్టిలైజర్ దుకాణాల దారులు అధిక ధరలకు ఎరువులు.. విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం అచ్చంపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఎస్ఐ సద్దాం తో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన విత్తనాలు అమ్మకూడదని సూచించారు. స్టాక్ బోర్డుపై నిల్వ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు. రైతులకు కొనుగోలు చేసే ఎరువులు విత్తనాలకు సంబంధించి తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని బిల్లుపై రైతు సంతకం ఫోన్ నెంబరు ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే ధరలు ఉండాలని తెలిపారు.