విద్యార్థులతో అవగాహన ర్యాలీ
ముకరంపుర,జూన్11(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ డిగ్రీ కోర్సులు, ఆధునిక విద్యా సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్ వనరులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్లేస్‌మెంట్ అవకాశాలు, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమాచారాన్ని ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు చేరవేసి, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో ప్రవేశాలు పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉపాధి ఆధారిత కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






