15 June, 2026 | 9:49 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు

15-06-2026 09:06 PM

చేర్యాల: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఓ రైతు పట్టా భూమి నుండి మట్టిని ముస్త్యాల గ్రామంలోని ఒక ఇటుకల బట్టికి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు సోమవారం చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్న సమయంలో మట్టిని రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి వాహనాలను చేర్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ మైనింగ్, మట్టి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.