10 March, 2026 | 11:31 PM

ఎట్టకేలకు వెలిగిన వీధి దీపాలు

10-03-2026 09:52 PM

కమిషనర్ చొరవతో వీధిలో వెలుగులు

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలోని 46వ డివిజన్లో వీధిదీపాలు వెలిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీధి దీపాలు లేక సామాజిక సేవా కేంద్రం వద్ద ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొనేవారు. పరిస్థితిని విజయక్రాంతి ప్రతినిధి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత దృష్టికి తీసుకెళ్లడంతో వీధిదీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వెలుగులు విరాజిల్లుతున్నాయి. కమిషనర్ కు ఆ డివిజన్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు