10 March, 2026 | 11:32 PM

జవహర్ నగర్ లో అదుపుతప్పి దూసుకొచ్చిన కారు

10-03-2026 09:48 PM

మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి తీవ్ర గాయాలు

జవహర్ నగర్, మార్చి10, (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబేద్కర్ నగర్లోని మిలీనియం పాఠశాల సమీపంలో మంగళవారం ఉదయం ఓ కారు అతివేగంగా దూసుకు వచ్చి చెట్టును  ఢీకొట్టగా అనంతరం అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై కారు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ప్రదీప్, రవి అను ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు  వెంటనే అంబులెన్స్ కు, ఫోన్ చేయగా, వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.