అయ్యప్ప దేవాలయంలో మెట్లపూజ
19-07-2026 05:07 PM
వర్షాలు కురవాలని హోమం
సుల్తానాబాద్, జూలై 19 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్లో గల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకం, మెట్ల పూజ, పడిపూజ, హోమం నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రెండు నెలలుగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు హోమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాయిరీ మహేందర్, అర్చకులు లక్ష్మణ శర్మ, సాయినాథ్, గురు స్వామి మురళీధర్, శశాంక్, వెంకటేష్ భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






