సోనం వాంగ్‌చుక్ దీక్షకు సంఘీభావం
నిర్మల్ జులై 19 (విజయక్రాంతి) : ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ (RTI Protection Committee) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తెలిపారు. రాష్ట్ర డైరెక్టర్, మాజీ న్యాయమూర్తి ఎం.ఏ. సలీంమరియు తో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక పాలన, ప్రజల హక్కుల సాధన కోసం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సోనం వాంగ్‌చుక్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కమిటీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనలో కమిటీకి చెందిన పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు.






