23 July, 2026 | 2:51 AM

రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

23-07-2026 12:00 AM

వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఈ నెల 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎ స్‌యూ సంఘాల నేతలు తెలిపారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టి. నాగరాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, వెంకట్ స్వామి, పల్లె మురళి తదితరులు పాల్గొని మాట్లాడారు.