ఈవీఎం గోదాంను రాష్ట్ర నోడల్ అధికారి తనిఖీ
21-04-2026 08:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని మంగళవారం, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, చీఫ్ ఎలెక్టోరల్ కార్యాలయ ఈవీఎం రాష్ట్ర నోడల్ అధికారి బి. హరిసింగ్ లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈవీఎం గోదాం తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, బిజెపి, టీడీపీ, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రవణ్ రెడ్డి, సిరికొండ రమేష్, హైదర్, మజార్, ముజాయిద్ అలీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






