16 August, 2026 | 8:32 PM

రేపటి నుండి మండల స్థాయి ప్రజావాణి

16-08-2026 06:38 PM

కోదాడ ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్ ఆదివారం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి అందరూ మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.