3 May, 2026 | 2:55 AM

ఎపిక్ యాక్షన్ కథతో 34వ సినిమా

03-05-2026 12:10 AM

హీరో టీ గోపీచంద్ వరుస ప్రాజెక్ట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘భరత వర్ష’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న ఆయన.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ఆయన నటించనున్న 34వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వీ వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతు న్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారభం కానుందని మేకర్స్ ప్రకటించారు.

యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న వీ వెంకట్.. ఈ సినిమాకు ఎపిక్ యాక్షన్ కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని షాందత్ ఐఎస్‌సీ అందిస్తుండగా, సంగీతాన్ని సామ్ సీఎస్ సమకూర్చుతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ మోనిక ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.