26 May, 2026 | 1:53 AM

పడకేసిన పనులు!

26-05-2026 01:01 AM
  1. ‘స్మార్ట్’ సిటీలో వెక్కిరిస్తున్న అసంపూర్తి పనులు
  2. నిధులు ఉన్నా నిబద్ధత కరువు 
  3. నేతల గొప్పల కోసమే నిధుల ప్రకటనలు!
  4. మండిపడుతున్న నగర ప్రజలు

కరీంనగర్, మే25(విజయక్రాంతి):కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద రూ.1,117 కోట్ల విలు వైన 50 ప్రాజెక్టులను అమలు చేసింది. వీ టిలో, రూ.884 కోట్ల విలువైన 36 ప్రాజెక్టు లు పూర్తయ్యాయి, రూ.233 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీరియడ్ పూర్తయిన ఇంకా చా లా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.  ఇం టిగ్రేటెడ్ మార్కెట్ ల పనులు ఇంకా పూర్తి కాలేదు, పూర్తి అయిన పద్మనగర్ మార్కెట్ పూర్తి అయినా నిరుపయోగంగా ఉంది.53 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులను అభివృద్ధి చేయగా, 27 పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు,అయితే చాలా పాఠశాలల్లో స్మార్ట్ తరగతిగదులు ప ని చేయడం లేదు.

బయో-మైనింగ్ ప్రాజెక్ట్ కిం ద లక్ష మెట్రిక్ టన్నులకు పైగా పాత వ్యర్థాలను శుద్ధి చెశారు తదనంతరం పనులు ఆగిపోవయి. టవర్ ప్రాం తంలో వాహనా ల రాకపోకలను నిషేదించి సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చెయలని నిర్ణయించి గాలికి వదిలారు. స్మార్ట్ రోడ్లు నేడు కంకర తెలుతున్న పట్టింపు లేకుండా పోయింది. ఈ పనుల పరిస్థితి ఇలా ఉండగా తాజాగా కరీంనగర్ అభివృద్ధికి అర్బన్ ఛా లెంజ్ ఫండ్ కింద కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.840 కోట్ల భారీ నిధుల ను ఆమోదించింది. ఈ నిధులతో నగరంలో వరద నివారణ, డ్రైనేజీ వ్యవస్థ, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వంటి పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రవాణా, రోడ్లు, తాగునీటి వ్యవస్థ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ఈ ప్రాజెస్తూ డి పి ఆర్ ప్రణాళిక బద్దంగా అమలు చేయకుంటే స్మార్ట్ సిటీ పనిలలాగే నేతల జేబులు నింపేందుకు పనికి వస్థాయి తప్ప నగర అభివృద్ధి కి కాదని నగరవాసులు అంటున్నారు. 

స్మార్ట్ సిటీ మా గొప్పే నని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మా గొప్పే అంటూ బి ఆర్ ఎస్, బి జె పి, కాంగ్రెస్ నేతలు పత్రికలకు ఎక్కడంలో పోటీ పడుతున్నారు. పోటీ అంటే ఇదికాడు నగర అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకోబడంలో ఉండాలని సీనియర్ సిటీజేన్ లు అంటున్నారు.