19 May, 2026 | 10:41 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

13-03-2026 08:22 PM

పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

నంగునూరు,(విజయక్రాంతి): రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం నంగునూరు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యా అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. మండలంలోని నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 245, రాజగోపాల్‌పేట పాఠశాలలో 185 మొత్తం 430 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని నియమించామని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.