7 April, 2026 | 4:20 AM

ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన పారితోషికం చెల్లించాలి

07-04-2026 02:24 AM

నేడు స్పాట్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు

టీటీజేఏసీ సంఘాలు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): గతేడాదిలో పదో తరగతి స్పాట్ మూల్యాంకన, కులగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషకం చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలైన టీటీ జేఏసీ, యూఎస్‌పీసీ, జాక్టో డిమాం డ్ చేశాయి. గతంలో ఎన్నోసార్లు విజ్ఞ ప్తి చేసినా ప్రభుత్వం వాటిని చెల్లించకుండా తాత్సారం చేస్తుండటంతో మంగళవారం స్పాట్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు సోమవారం ఉమ్మడి ప్రకటనను ఆయా సంఘాలు విడుదల చేశాయి. గత ఏడు సంవత్సరాలుగా స్పాల్ పారితోషకం పెంచలేదని, స్పాట్ రేట్లను కనీ సం 50 శాతం పెంచాలని కోరాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నేతలు పిలుపునిచ్చారు.