7 April, 2026 | 4:54 AM

తెలంగాణ జాతిపిత గద్దర్

07-04-2026 03:12 AM
  1. బేషరతుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించాలి: ప్రొ.కంచె ఐలయ్య
  2. తెల్లాపూర్‌లో గద్దర్ పునర్జీవ సభ

సంగారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ప్రకటిం చాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో సోమవారం రాత్రి స్థానికులు నిర్వహించిన గద్దర్ పునర్జీవ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల గద్దర్ జాతిపిత కావాల ని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను గౌరవించి ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో లక్షల కోట్లు దోపిడీ చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతిపిత కాబోరని స్పష్టం చేశారు.

గద్దర్ ఒంట్లో బెల్లెట్లు దిగితే, గాంధీజీలా ఆయన చావలేదని, ఏసులాగా పునర్జన్మ పొందాడని గుర్తుచేశారు. ఒంట్లో ఆరు బులెట్లు దిగితే, డాక్టర్లు ఐదు బులెట్లు తీశారని, డాక్టర్ మిగిలిన ఒక్క బుల్లెట్ తీస్తే, చనిపోతావని చెప్పినా గద్దర్ భయపడలేదని కొనియాడారు. ఆ తర్వాత అంతకంటే ఉధృతంగా పాటలు పాడుతూ జనం మధ్యే ఉన్నారని గుర్తుచేశారు. గద్దర్ చనిపోయిన ఆరు నెలలకే తెల్లాపూర్‌లో విగ్రహం పెట్టిన ఘనత కొల్లూరి సత్తయ్యకే దక్కిందని కితాబునిచ్చారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లా డుతూ.. గద్దర్‌ను జాతిపితగా ప్రకటించాలని, తాను సీఎం రేవంత్‌రెడ్డిని కోరతానని తెతలిపారు.

గద్దర్ ఎప్పుడు బీజేపీని వ్యతిరేకించలేదని, ఒక దశలో కేసీఆర్‌ను పొగిడి న రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేశా రు. గాయని విమలక్క మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఆటాపాట లేనిది, ఏ సభా జరిగేది కాదని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను జాతిపిత అంటే నల్లమల నక్కలు నవ్వుకుంటా యని, ముమ్మాటికీ గద్దర్ మాత్రమే రాష్ట్ర జాతిపిత అని పేర్కొన్నారు. కార్యక్రమాంలో నిర్వాహకుడు భరత్, అతిథులు సత్తయ్య, జేబీరాజ్, నలమాస కృష్ణ, నలిగంటి శరత్, గుడిపల్లి రవి, పృథ్వీరాజ్ పాల్గొన్నారు.