7 April, 2026 | 4:05 AM

బీసీలు ఓట్లు వేయడానికేనా?

07-04-2026 02:21 AM

కులగణన చేయకుండా బీజేపీ కుట్రలు

13న మహబూబ్‌నగర్ నుంచి ప్రచారం

పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు వెల్లడి 

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బీసీలు ఓట్లు వేయడానికేనా..? రాజ్యాధికారం చేపట్టడానికి పనికిరామా..? మేం ఎన్ని రోజులు అడుక్కు తినాలి..? కనీసం మా జానాభా ఎంతో చెప్పడానికి కేంద్రం ఎం దుకు ముందుకు రావడం లేదు..? అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు.

సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జనగణనలో కులగణన చేయాల్సిందేనని, లేదంటే కేంద్రంపై యుద్ధం చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. బీసీలపై కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు వీహెచ్ తెలిపారు. ఈ నెల 13న మహబూబ్‌నగర్‌లో యాత్రను ప్రారంభించనునట్లు చెప్పారు. ఆ తర్వాత 14న నల్లగొండ జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జనగణనలో కులగణన ఎందు కు చేయడం లేదన్నారు.

కులగణన చేపట్టకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. బీజేపీకి కులగణన చేయకపోతే రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే కుల గణన చేస్తామని వీహెచ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణన చేశారని, బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చార ని వీహెచ్ తెలిపారు. చదవుకుంటేనే బతుకు మారుతుందని మహాత్మా జ్యోతిరావు ఫూలే చెప్పారని, ఆయ న బాటలోనే అంబేద్కర్ ఉన్నత చదవులు చదివారని అన్నారు. అంబేద్కర్‌కుకు రాజ్యాంగాన్ని రాసే అవకా శం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని ఆయన గుర్తు చేశారు.