7 April, 2026 | 4:19 AM

సింగిల్‌గానే..

07-04-2026 02:30 AM
  1. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మూడు మేయర్ స్థానాలూ గెలుస్తాం

రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు రానున్నాయ్

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి

పార్టీలో ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దు

బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికలైనా బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తోందని, అయితే ఇటీవల జరిగిన స్థానిక సం స్థల ఎన్నికల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్థానిక నాయకులు నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులున్నాయని, పార్టీ ఎక్కడా పొత్తులకు పోదని పేర్కొన్నారు.

తెలంగాణ లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీల పాలనను ప్రజలు చూసారు కాబట్టి.. ప్రజల వద్దకు వెళ్లి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులందరూ ఇందుకు కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమ వారం 47వ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్‌రావు, శాసనమండలి బీజేపీ ఫ్లోర్‌లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ జాతీయవాదాన్ని ఎంచుకుందని, 1980 నుంచి ఇప్పటివరకు ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు కాబట్టే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్నారు.

నైతిక విలువలు, సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చామని, సేవ అంటే సంఘటన్.. సంఘటన్ అంటే సేవ అన్నారు. పార్టీకి 40 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ పాలన సాగుతున్నదని చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రాలు అభివృద్ధి చెందవన్నారు.

కార్యకర్తలు నాయకుల కష్టమే..

పార్టీ ఎదగడానికి కోట్లాది మంది కార్యకర్తలు.. నాయకుల కష్టమేనని, పార్టీ సిద్ధాం తం, పార్టీ కోసం పనిచేసేవాళ్ళను చూసి నేర్చుకోవాలని, అందరం కలిసి మెలిసి పనిచేద్దామన్నారు. బాధ్యతలు కొందరికి ముందు.. కొందరికి తరువాత వస్తాయని, నిరుత్సాహపడవద్దు అని రాంచందర్‌రావు చెప్పారు. పార్టీ నాయకులపై, పార్టీ మీద మాట్లాడేటప్పుడు.. సోషల్ మీడియాలో మాట్లాడొద్దని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఏ అంశమైనా ఇంటర్నల్‌గా మాట్లాడాలని, అందరం ఏకమై ముందుకుపోదా మని, తాను కూడా మీలో ఒక కార్యకర్తనే అని అన్నారు.

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి మూడు మేయర్ పీఠాలను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశహితమే పరమావధిగా ప్రారంభమైన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. నాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని అన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్టానికి ఎంతో సహకారం అందిస్తుందని, జాతీయ రహదారులు ఎవరి హయాంలో ఎక్కువ వచ్చాయో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. ఖానాపూర్‌లో చైర్మన్ గెలిచామని, స్థానిక పరిస్థితులను బట్టి అక్కడి నాయకులు కొన్ని పార్టీలతో కలిసి వెళ్లాల్సి వచ్చిందని, అంతేగానీ భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని అన్నారు. 

పదవుల కోసం పోరాడే పార్టీ బీజేపీ కాదని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయాల్లో ముఖ్యమైంది.. నైతిక విలువలు పాటించడమేనని, నా బంధువులు నా కుటుంబం అనికాకుండా.. నా దేశం నా సమాజం అనే ఆలోచ న చేయాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో  అన్ని పార్టీలు ఏకమవ్వడంతో ఇందిరాగాంధీ ఓడిపోయారన్నారు. 

నిర్మాణాత్మకమైన పాత్ర: మురళీధర్‌రావు

బీజేపీ కార్యకర్తలు విలక్షణమైన, ఇతర పార్టీ కార్యకర్తలు బిన్నంగా ఉంటారని బీజేపీ జాతీయనాయకులు మురళీధర్‌రావు అన్నారు. నాడు బీజే పీ సిద్ధాంతాలు దేశంలో నడవవు అన్నారని, ఆ పార్టీకి భవిష్యత్ ఉం టుందా అని వాళ్లన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యం బలోపేతం చేయడంలో ముందున్న పార్టీ అన్నారు. ప్రతిపక్షంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిం చిన పార్టీ అని, కాంగ్రెస్ చెప్పిందే జాతీయవాదం అంటే.. కాదని చూ పించిన పార్టీ బీజేపీ అన్నారు.

రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదని చెప్పిన పార్టీ బీజేపీ అని, కాంగ్రెస్ పార్టీ నక్సల్స్‌తో కలిసి పని చేసిందని చెప్పారు. దేశ, రాష్ట్ర, వ్యక్తి భవిష్యత్ బాగుపడాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికా రంలోకి రావడం అసాధ్యమేమీకాదన్నారు.