గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ బంద్ ప్రశాంతం
- డిపో వద్ద ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న పార్టీ శ్రేణులు
భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు
మధ్యాహ్నం నుంచి తెరుచుకున్న దుకాణాలు
క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడి సిగ్గుచేటు
బీఆర్‌ఎస్ నేతలు వంటేరు, మాదాసు
గజ్వేల్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసినందుకు నిరసనగా సోమవారం గజ్వేల్ పట్టణంలో బీఆర్ ఎస్ పార్టీ బంద్ నిర్వహించింది. బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు వేకువజాము నుంచి ఆర్టీసీ డిపో ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు డిపో ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్ నా యకులను చెదరగొట్టారు.దీంతో ఉద యం 7 గంటల తర్వాత బస్సుల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ముందుగా ప్రజ్ఞాపూర్‌లో బీఆర్‌ఎస్ నేతలు బంద్ నిర్వహించారు. అనంతరం గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాపరెడ్డి నేతృత్వంలో భారీస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేశారు.
అనంతరం ఇంది రా పార్క్ చౌరస్తాలో కూడా కొద్దిసేపు బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తంచేశాయి. ప్రైవే టు పాఠశాలలు చాలా వరకు మూసివేయగా, మరికొన్ని మధ్యాహ్నం కొనసాగా యి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, తదితరులు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ వల్లే గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయ డం సిగ్గుచేటని, ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.




